‘స్థానిక’ పోరులో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలవాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
సాక్షి, హైదరాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మిత్రపక్షాలతో పరస్పర అవగాహన విషయంలో కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నా రు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శత్రువును ఎదుర్కొనేందుకు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని మొన్నటి ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయన్నారు. కాంగ్రెస్, ఆప్ పార్టీల స్వయంకృతాపరాధం వల్లనే ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను స్థానిక సంస్థల ఎన్ని కల నాటికి అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే అ ప్పులు చేసైనా.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఉచితాల కారణంగా వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని, ఇతర పనులకు కూడా ఎవ్వరూ రావడం లేదని మేధావులు, న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనే సంక్షేమ పథకాల రూపంలో తిరిగి వారికి ఇస్తున్నారు తప్ప ఉచితంగా కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment