డిమాండ్ ఎక్కువ.. రైళ్లు తక్కువ
రామగుండం: జిల్లాలోనేకాదు.. రాష్ట్రంలోనూ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభామేళా విశేషాలపైనే చర్చ సాగుతోంది. ఈనెల 26న మహాశివరాత్రి రోజు మహాకుంభామేళా వేడుకలు ముగియనున్నాయి. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్నస్నానం ఆచరించాలనేది భక్తుల అచంచల విశ్వాసం. అందుకే ప్రయాగ్‌రాజ్‌కు నడిపిస్తున్న రైళ్లు భక్తులతో రద్దీగా మారుతున్నాయి. ఎంతగా అంటే.. తత్కాల్ టికెట్లు కూడా క్షణాల్లో రిజర్వుకావడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రయాగ్‌రాజ్ సుమారు 1,120 కి.మీ. దూరంలో ఉంది. రైళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో కొందరు భక్తులు గ్రూపుగా ఏర్పడి ప్రత్యేకంగా ప్రైవేట్ వాహనం అద్దెకు మాట్లాడుకుని వెళ్తున్నారు. ఇలావెళ్ల వారిసంఖ్య పెరిగిపోతుండడంతో రహదారులన్నీ రద్దీగా మారుతున్నాయి. ఫలింగా గంటల తరబడి ట్రాఫిక్ జామవుతోంది.
మరిన్ని ప్రత్యేక రైళ్లు అవసరం..
మరికొన్ని రోజుల్లో మహాకుంభామేళా పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో భక్తులు సురక్షితంగా అక్కడకు వెళ్లి వచ్చేందుకు రైల్వేశాఖ డిమాండ్‌కు అనుగుణంగా ప్రధాన రైల్వేస్టేషన్ల నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపించాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్ల నుంచి రోజూ ఒక ప్రత్యేక రైలును నడిపించేందుకు ఎంపీలు రైల్వేశాఖపై ఒత్తిడి పెంచాలని అంటున్నారు. ప్రస్తుతం రెగ్యులర్, వారాంతపు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఏసీ, నాన్ ఏసీ కేటగిరీల్లో అదనపు బోగీలు జోడించినా భక్తులకు కొంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.
సురక్షితం.. సౌకర్యం..
రామగుండం నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్లలో ప్రయాణం సురక్షితంగా, తక్కువ ఖర్చుతో, సుఖమయంగా ఉంటుంది. నిర్దేశిత గడువులోగా ప్రయాగ్‌రాజ్ చేరుకునే అవకాశం ఉంది. దీంతోపాటు రైల్వేస్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే త్రివేణి సంగమం చేరుకోవచ్చు. అక్కడే పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు తక్కువ ఖర్చుతో సకాలంలో చేరుకునే వీలుంటుంది. వాహనాలు లభ్యం కానిభక్తులు కూడా నేరుగా నడక మార్గం ద్వారా చేరుకునే అవకాశాలూ ఉన్నాయి. రైల్వేశాఖకు రూ.కోట్ల ఆదాయం కూడా సమకూరుతుంది.
ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణం నరకం
క్షణాల్లో రిజర్వు అవుతున్న ‘తత్కాల్’ టికెట్లు
రహదారి మార్గంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్
26తో ముగియనున్న కుంభామేళా పుష్కరాలు
ప్రత్యేక రైళ్ల సంఖ్య పెంచాలని భక్తుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment