ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్
శంకరపట్నం: ఆన్‌లైన్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఏడిగ మధు(33) కొన్ని రోజులుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటయ్యాడు. ఈ క్రమంలో సుమారు రూ.10లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. మనస్తాపానికి గురై ఈనెల 10న ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ ఆదివారం మరణించాడు. మధుకు భార్య గీత, ఇద్దరు కొడుకులు ఉన్నారు. గీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment