ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రానికి చెందిన నార మహిపాల్(32) శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై ఆదివారం లక్ష్మణ్ తెలిపారు. పని నిమిత్తం జగిత్యాల జిల్లా ఎండపల్లికి వెళ్లిన మహిపాల్.. పని పూర్తయ్యాక ఎండపల్లి నుంచి మోటార్ సైకిల్‌పై స్థానిక ఓ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. ఈక్రమంలో ఫంక్షన్ హాల్ సమీపంలోని క్రీడాప్రాంగణం వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు జైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment