వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్షతోపాటు జరిమానా తప్పదని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల చేపట్టిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 120 మంది పట్టుబడ్డారన్నారు. వీరందరిని ఈనెల 15న కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యోతిర్మయి ఆటో డ్రైవర్‌కు మూడు రోజుల జైలుశిక్షతోపాటు రూ.2వేలు జరిమానా విధించారన్నారు. మద్యం సేవించిన మరో 119 ద్విచక్ర వాహనదారులకు రూ.2,38,500 జరిమానా విధించినట్లు వివరించారు.
మరో 119 మందికి జరిమానా
టౌన్ సీఐ వీరప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment