అధికారులను తప్పుదోవ పట్టించిన ముగ్గురిపై కేసు | - | Sakshi
Sakshi News home page

అధికారులను తప్పుదోవ పట్టించిన ముగ్గురిపై కేసు

Published Mon, Feb 17 2025 12:11 AM | Last Updated on Mon, Feb 17 2025 12:11 AM

-

వేములవాడరూరల్‌: అక్రమ ఇసుక తరలింపు అంటూ అధికారులను తప్పుదోవ పట్టించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వేములవాడరూరల్‌ మండలం లింగంపల్లి మూలవాగు నుంచి ప్రభుత్వ అనుమతులతో ఇసుకను తరలిస్తుండగా ఈ విషయాన్ని ముగ్గురు వ్యక్తులు అక్రమ ఇసుక తరలిస్తున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తహసీల్దార్‌ సుజాత ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు లింగంపల్లికి చెందిన ఎ.మహేందర్‌, ఎ.నరేశ్‌, హన్మాజీపేటకు చెందిన రాకేశ్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement