దస్తావేజులేఖరిపై కేసు
మానకొండూర్: మానకొండూర్ మండలకేంద్రంలోని దస్తావేజులేఖరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసుల తెలిపారు. వారి వివరాల ప్రకారం.. మానకొండూర్‌కు చెందిన అడప వినయ్ స్థానికంగా దస్తావేజులేఖరిగా పనిచేస్తున్నాడు. నకిలీ సాదాబైనామాతో 24గుంటల భూమిని తనతో పాటు తన తండ్రి అడప వీరయ్య, చెల్లెలు దివ్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని అడప కిష్టయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసి వినయ్‌పై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మినారాయణ పేర్కొన్నారు.
డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా బిల్డింగ్ అండ్ ఆధర్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ముద్రించిన డైరీ, క్యాలెండర్‌ను ఆదివారం ముకుందలాల్ మిశ్రాభవన్‌లో జిల్లా కార్యదర్శి, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలు చేయడానికి సిద్ధంగా ఉందని, లేబర్ కోడ్స్ వల్ల భవన నిర్మాణ కార్మికుల 3 చట్టాలు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. లేబర్ కోడ్స్ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా లబ్ధి పొందే క్లెయిమ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మోటార్ సైకిల్ ఇస్తామని ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కదిరే రమేశ్, కోశాధికారి వట్టి జగదీశ్, ఉపాధ్యక్షులు రేణుకుంట సారయ్య, రావుల ఎల్లయ్య, జంబుకం వెంకన్న, అనుముల మల్లారెడ్డి, సహాయ కార్యదర్శులు శనగరపు రాజు, చక్రపాణి, లింగారెడ్డి, శ్రీధర్, ఇళ్ళందుల రవి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య
రామగుండం: పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణంల చోటు చేసుకుంది. ఎస్సై సంధ్యారాణి కథనం ప్రకారం.. పోస్టాఫీసు సమీప జెన్ క్వార్టర్‌లో నివాసం ఉండే సివిల్ కాంట్రాక్టర్ పుల్లూరి భగవాన్‌రావు ఏకై క కుమారుడు బాలాజీ(34) కొంతకాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. తనకు వివాహం కావడం లేదని మదనపడుతూ ఉన్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. దహన సంస్కారాల కోసం కుటుంబసభ్యులు ప్రత్యేక వాహనంలో కరీంనగర్‌లోని సొంతింటికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment