55 ఏళ్లకు కలిశారు
వేములవాడ: స్థానిక హైస్కూల్‌లో మొట్ట మొదటి పదోతరగతి బ్యాచ్(1968–69) విద్యార్థులు 55 ఏళ్లకు కలుసుకున్నారు. స్థానిక ఎస్సారార్ గ్రాండ్ హోటల్‌లో ఆదివారం బాల్యమిత్రులు కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పి చనిపోయిన గురువులకు నివాళి అర్పించారు. ప్రస్తుతం ఉన్న ఏకై క గురువు విఠల్‌ను సన్మానించుకున్నారు. నగుబోతు ప్రభాకర్, ఎండీ ఖాజాపాషా, మధు రాధాకిషన్, వెంకటేశ్వర్లు, గంగయ్య, జి.జ్యోతి, జి.విజయ, జనబాయి, సలీం పాషా, ఎండ మునీర్, శర్మ, బాలకిషన్, ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment