రోడ్డు ప్రమాదంలో ధర్మపురి వాసి మృతి
ధర్మపురి: కుంభమేళకు వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ మహిళ మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన వెంగల ప్రమీల (50) వారం క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి రెండు కార్లలో ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళకు వెళ్లారు. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించి అక్కడి నుంచి కాశీ, వారణాసి తదితర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. తిరిగి వస్తుండగా.. మార్గంమధ్యలో మధ్యప్రదేశ్‌లోని రేనా ప్రాంతంలో కారు అదుపు తప్పి స్తంభానికి ఢీ కొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ప్రమీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వైద్యం అందించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమీల ప్రయాణిస్తున్న కారులోనే ఉన్న ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్లు, మనుమరాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమీల భర్త గతంలోనే మృతి చెందాడు. ధర్మపురిలోని గోదావరి వద్ద కొబ్బరికాయలు అమ్ముకొని జీవనోపాధి పొందుతోంది. ఆమె మృత దేహాన్ని ధర్మపురికి తీసుకొస్తున్నట్లు బంధువులు తెలిపారు.
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఘటన
Comments
Please login to add a commentAdd a comment