సెల్‌టవర్ ఎక్కి నిరసన
శంకరపట్నం: తన తమ్ముడు తనపై, తన భార్యపై దాడిచేశాడని సైదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఎస్సై పట్టించుకోవడం లేదని సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన దుర్గం కొమురయ్య ఆదివారం మండలంలోని కేశవపట్నంలో సెల్‌టవర్ ఎక్కాడు. బాధితుడి వివరాల ప్రకారం.. దుర్గం కొమురయ్యతో ఇటీవల తన సోదరుడు తిరుపతి గొడవ పడ్డాడు. కొమురయ్య, ఆయన భార్యపై దాడిచేశాడు. దీంతో కొమురయ్య భార్య పురుగుల మందు తాగింది. ఈ విషయమై సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని కేశవపట్నంలో సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. బ్లూకోల్ట్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, కొమురయ్యతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment