బీసీ ముస్లింలను మినహాయిస్తే ఉద్యమిస్తాం
కరీంనగర్: రాష్ట్రంలో బీసీ కులగణన, రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పష్టత లేకుండా ప్రకటనలు చేస్తున్నాయని, బీసీ ముస్లింలను మినహాయించి తీర్మానం చేస్తే ఆందోళనలు చేస్తామని రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన కులగణన ద్వారా ఎవరెంత ఉన్నది స్పష్టం అయినందున బీసీల లెక్కలు తేలాలయని, కానీ బీసీలను కూడా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని మతపరంగా విభజించడం బాధాకరమన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42శాతం రిజర్వేషన్ల పెంపు హామీ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని, అసెంబ్లీలో 56శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయాలన్నారు. 10శాతం ముస్లిం బీసీలను మినహాయించాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment