కరీంనగర్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ సుడా చైర్మన్ జీవీ.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావులు పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని రామకృష్ణారావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment