● కలవరం రేపుతున్న రైతు ఆత్మహత్యలు ● ఏడాదిలో ఉమ్మడి జిల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
ఆరుగాలం శ్రమించి.. నలుగురికి పట్టెడన్నం పెట్టే అన్నదాత అలసిపోతున్నాడు. ఎంత కష్టపడ్డా.. ఫలితం రాకపోగా.. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి కట్టలేకపోతున్నాడు. రుణభారం భరించలేక జీవిత పోరాటంలో ఓడి ప్రాణాలు తీసుకుంటున్నాడు. నేలతల్లిని నమ్ముకున్న రైతుబిడ్డ మధ్యలోనే ఆ తల్లితో బంధం తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడు. దిగుబడి రాని పంటలు, పెరిగిన వడ్డీలకు భయపడి అప్పులోళ్లకు ముఖం చెల్లక ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో దాదాపు 30 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు అన్నదాత దయనీయ స్థితిని చెప్పకనే చెబుతున్నాయి. దీనికితోడు రైతు భరోసా, రుణమాఫీ సమయానికి కాకుండా జాప్యమవడం రైతుల ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచేలా చేస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి.
పాత జిల్లాలో కలకలం
ఉమ్మడి జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. సాగును నమ్ముకుని అప్పులు చేసి పొలాలు కౌలుకు తీసుకుని మరీ సేద్యం చేస్తే.. చివరికి వడ్డీలు పెరిగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటం కలవరపెడుతోంది. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక వేదనతో ప్రాణాలు తీసుకోవడంతో ఆ రైతుల కుటుంబాలు మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో కరీంనగర్‌లో 10 మంది, జగిత్యాలలో 6 మంది, సిరిసిల్లలో 10 మంది, పెద్దపల్లిలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో మెజారిటీ సాగు కోసం అధిక పొలం కౌలుకు తీసుకున్న వారే కావడం గమనార్హం. వీటికితోడు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అయ్యే ఖర్చ అదనం. ఫలితంగా రైతు చేస్తున్న అప్పులకు వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. అన్ని కష్టాలకు ఓర్చి పండించిన పంట సరైన దిగుబడి రాక, అనుకున్న మేర గిట్టుబాట ధర రాకపోవడంతో రైతు కలత చెందుతున్నాడు. ముందున్న బాధ్యతలు, అప్పులు, వాటికి వడ్డీలు తలచుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాడు.
ఉమ్మడి జిల్లాలో మరణించిన రైతులకు చెల్లించిన రైతు బీమా వివరాలు
జిల్లా రైతులు బీమా
కరీంనగర్ 234 రూ.11 కోట్లు
రాజన్నసిరిసిల్ల 186 రూ.9.30 కోట్లు
జగిత్యాల 378 రూ.18.90 కోట్లు
పెద్దపల్లి 183 రూ.9.15 కోట్లు
● కలవరం రేపుతున్న రైతు ఆత్మహత్యలు ● ఏడాదిలో ఉమ్మడి జిల్
Comments
Please login to add a commentAdd a comment