కవిత్వం మానవతా విలువలు తెలియజేస్తుంది
కరీంనగర్ కల్చరల్: కలల లోగిలిలోని కవితలు మానవ సంబంధాలు, మానవతా విలువలను పెంపొందించే విధంగా ఉన్నాయని వ్యంజకాలు ప్రక్రియ రూపకర్త పొత్తూరి సుబ్బారావు అన్నారు. ఆదివారం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరై నగునూరి రాజన్న రచించిన ‘కలల లోగిలి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కవికి మారుతున్న ప్రపంచ పరిణామాలపై అవగాహన ఉండాలన్నారు. సాహిత్యంలో భిన్న ప్రక్రియల సృజన శుభపరిణామమని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ కవి రచయిత దాస్యం సేనాధిపతి నగునూరి రాజన్న రాసిన హైకూల సంపుటి వెలుగు పూలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేవీ.గోపాలాచార్య, బొమ్మకంటి కిషన్, సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, జనగాని యుగంధర్, నడిమెట్ల రామయ్య, ఇటిక్యాల రాము, మఠం సాంబమూర్తి, విలాసాగరం రవీందర్, గంప ఉమాపతి, వెల్ముల జయపాల్‌రెడ్డి, దామరకుంట శంకరయ్య, దేవి యాదగిరి, ఎలగొండ రవి, యడవెల్లి తిరుమలరెడ్డి, శ్యాంసుందర్, సింగిరెడ్డి రాజిరెడ్డి, పి.రాంమోహన్, ఆర్.పాండురంగం పాల్గొన్నారు.
ముగిసిన స్వదేశీ మేళా
కరీంనగర్‌టౌన్: స్వదేశీ సంస్థలు, వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో గత ఆరు రోజులుగా నిర్వహించిన స్వదేశీ మేళా విజయవంతమైంది. ఈనెల 11న ఉద్యోగ మహోత్సవ్ జాబ్‌మేళా, దాదాపు 210 స్వదేశీ వస్తు ప్రదర్శన స్టాళ్లతో స్వదేశీ మేళా వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ రోజు ప్రముఖులతో వివిధ అంశాలతో సెమి నార్‌లు, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ముగింపు రోజున జరిగిన సెమినార్‌కు కాలమిస్ట్, ప్రోమినెంట్ అథార్ భాస్కర్‌యోగి, ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యవక్తలుగా హాజరై మాట్లాడారు. స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సహం కోసం పనిచేస్తున్న ఏకై క స్వచ్ఛంద సంస్థ అని కొనియాడారు.
జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు
కరీంనగర్‌స్పోర్ట్స్: తైక్వాండో నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో జనవరి 28 నుంచి 30వ తేదీవరకు జరిగాయి. కరీంనగర్‌కు చెందిన క్రీడాకారుల్లో బాలికల విభాగంలో డి.శ్రీనిధి కాంస్యం, బాలుర విభాగంలో ఎ.విష్ణు తేజ కాంస్యం, ఎన్.విహన్‌రావ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా తైక్వాండో కోచ్ పెండ్లి రాజేందర్, పెద్దపల్లి జిల్లా తైక్వాండో జనరల్ సెక్రటరీ నేవూరి సతీశ్‌కుమార్‌ను సప్తగిరి గవర్నమెంట్ పాఠశాలలో సత్కరించారు. వాకర్స్ అసోసియేషన్ డిప్యూటీ గవర్నర్ గడప కోటేశ్‌కుమార్, సెక్రటరీ నర్సింగోజు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పాకానందు సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
నేటి నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు
కరీంనగర్‌టౌన్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, డాక్టర్ కె. వెంకటరమణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్– ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం ఆదేశాల మేరకు గత కొన్ని నెలల క్రితం ‘రెఫ్రాక్టివ్ ఎర్రర్స్’తో పరీక్ష చేయబడిన 2,588 విద్యార్థుల దృష్టి లోపాలను మళ్లీ నిర్ధారించేందుకు కంటి పరీక్షలు ఈనెల 17 నుంచి 15 రోజులపాటు నిర్వహించడానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. జీజీహెచ్ కరీంనగర్, ఏరియా హాస్పిటల్ హుజూరాబాద్‌లో షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
కవిత్వం మానవతా విలువలు తెలియజేస్తుంది
కవిత్వం మానవతా విలువలు తెలియజేస్తుంది
Comments
Please login to add a commentAdd a comment