కాంగ్రెస్‌కు ఓట్లడిగే హక్కు లేదు
కరీంనగర్‌టౌన్: టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓట్లడిగేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హతే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో ఆదివారం జరిగిన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... టీచర్లు, గ్రాడ్యుయేట్ల పక్షాన ఎన్నడైనా పోరాటాలు చేశారా అని ప్రశించారు. 317 జీవోకు వ్యతిరేకంగా ఎన్నడైనా కేసీ ఆర్ సర్కార్ తో కొట్లాడారా అని అన్నారు. గ్రూ ప్–1 సహా నిరుద్యోగుల పక్షాన ఎన్నడైనా జైలుకు వెళ్లారా? అని, కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేయాలన్నారు. టీచర్లు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం కొట్లాడింది, జైలుకు వెళ్లింది, లాఠీదెబ్బలు తిన్న చరిత్ర బీజేపీదే అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అనేక మంది బీజేపీ కార్యకర్తలపై నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పా టు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పలు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. నిరుద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన చరిత్ర బీజేపీదే అన్నారు. గ్రూప్–1 ఉద్యోగుల పక్షాన కేంద్రమంత్రిగా ఉంటూ మద్దతు తెలిపి పోరాటం చేశానని స్పష్టం చేశారు. తాను 317 జీవోను సవరించాల ని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుంటే తన ఆఫీస్ గేట్లను గ్యాస్ కట్టర్ల్లతో పోలీసులు కత్తిరించి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారని గుర్తుచశారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి బీజే పీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్‌రావు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.
టీచర్స్, గ్రాడ్యుయేట్ల పక్షాన ఒక్కనాడైనా పోరాటాలు చేశారా?
కమీషన్లు, కుట్రలు తప్ప కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసిందేమిటి?
ఎమ్మెల్సీ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలతో కేంద్రమంత్రి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment