● విలీన గ్రామాల్లో అన్యాక్రాంతం ● పెరిగిపోతున్న ఆక్రమణల
సర్కారు
భూములు మాయం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ విలీన గ్రామాల్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అవుతున్నాయి. పల్లెలు పట్టణాలుగా మారిన క్రమంలో భూముల ధరలకు రెక్కలొస్తుండగా, ఇదే అదనుగా కొంతమంది ప్రభు త్వ స్థలాల్లోనే అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల చింతకుంట, మల్కాపూర్, లక్ష్మిపూర్, గోపాల్‌పూర్, దుర్శేడ్ గ్రామాలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనం కావడం తెలిసిందే. విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే, నగరపాలకసంస్థ పూర్తిస్థాయిలో గ్రామాల్లో పాలనాపరమైన బాధ్యతలు తీసుకునే పని చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, ఇళ్ల వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంలోనే పల్లెల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కొంతమంది తమ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలోకి హద్దులు జరుపుతుండగా, మరికొంతమంది ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే ఇంటినంబర్లతో నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. చింతకుంట విలీన గ్రామంలోని 439 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉంది. ఇదే సర్వే నంబర్‌లో గతంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడంతో, దీన్ని అవకాశంగా తీసుకొని పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తాజాగా నగరపాలకసంస్థగా మారడంతో కబ్జాలు వేగం పుంజుకుంటున్నాయి. అలాగే గత విలీన గ్రామమైన అలుగునూరులోనూ భూ ఆక్రమణలు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభు త్వ భూమి సర్వేనంబర్ 436లో కొంతమంది అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారంటూ అంబేడ్కర్ యువజనసంఘం ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రభు త్వ భూమి లో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా విలీన ప్రాంతాల్లో జరుగుతున్న భూ ఆక్రమణలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్ర భుత్వ భూములు కాపాడాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు స్వయంగా, ఫోన్‌లో ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment