మరోమారు కుటుంబ సర్వే
● ఈ నెల 28 వరకు నిర్వహణ ● మూడు పద్ధతుల్లో అవకాశం ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేలో వివిధ కారణాలతో పాల్గొనని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వే కొనసాగనుందని తెలిపారు. ఈ సర్వేలో మూడు విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉండడం, వివిధ కారణాలతో వివరాలు ఇవ్వని వాళ్లు మాత్రమే ఈ సర్వేను వినియోగించుకోవాలని తెలిపారు. ఇంతకుముందు సర్వేలో పాల్గొనని వారు నేరుగా ప్రజా పాలన సేవ కేంద్రాల్లోనూ సంప్రదించవచ్చని, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీవో కార్యాలయాలలో ఈ ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు . అక్కడి సిబ్బంది వివరాలను సేకరించి సర్వేలో నమో దు చేస్తారని తెలిపారు. ఆన్‌లైన్ నుంచి సర్వే ఫారం డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి ఆ ఫారాన్ని నేరుగా ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వొచ్చని తెలిపారు. https:// seeepcsurvey. cgg. gov. in లాగిన్ ద్వారా సర్వే ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మూడు పద్ధతుల ద్వారా ఇదివరకు వివిధ కారణాల వల్ల సర్వేలో నమోదు కాని వారు రీ సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment