బతుకు భారమై..
అప్పులు చెల్లించలేక..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన పిట్ల లింగన్నకు తోకల లక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. లింగన్న వ్యవసాయం, లక్ష్మీ బీడీలు చేసేవారు. లింగన్నకున్న మూడెకరాల్లో పసుపు, మొక్కజొన్న, సజ్జ, వరి పండించాడు. దిగుబడి సరిగా రాక రూ.16 లక్షలు అప్పు చేశాడు. అది వడ్డీతో కలిపి రూ.20 లక్షల వరకు అయ్యింది. ఈ సీజన్‌లో పసుపు రెండెకరాల్లో వేయగా దుంపకుళ్లు రోగం వచ్చింది. దీనికితోడు బ్యాంకులో తీసుకున్న రుణం రూ.2లక్షలు మాఫీ కాలేదు. రైతు భరోసా సమయానికి అందలేదు. ఆ ఆవేదనతో లింగన్న ఈ ఏడాది జనవరి 14న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ 20వ తేదీన మృతిచెందాడు. లింగన్న కొడుకు హర్షవర్దన్ 8వ తరగతి, కూతురు నైనిక 2వ తరగతి చదువుతున్నారు. పెంకుటింట్లో నివసిస్తూ, బీడీలు చుడుతూ లక్ష్మి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ఉన్న మూడెకరాలు అమ్మినా.. తన భర్త చేసిన అప్పులు తీరవని ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment