
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబా ద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో సోమవారం జరి గిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తిమ్మాపూర్‌కు చెందిన సోహెల్(26) బతుకుదెరువు కోసం బ హ్రెయిన్ వెళ్లి రెండు రోజుల క్రితమే సొంతూరుకు వచ్చాడు. సోహెల్‌ను కలిసేందుకు సమీప బంధు వు, జగిత్యాల జిల్లా యూసుఫ్‌నగర్‌కు చెందిన మ హమ్మద్ సుమేర్ (21) ద్విచక్రవాహనంపై తిమ్మాపూర్ వచ్చాడు. ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో విద్యుత్‌స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, మోర్తా డ్ ఎస్సై విక్రమ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
భార్య, కూతురును చూడకుండానే మృత్యువాత
సోహెల్ భార్య ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో త ల్లి వద్ద ఉంటోంది. నాలుగు రోజుల క్రితమే కూతురు మొదటి పుట్టినరోజు జరిగింది. రెండు రోజుల క్రితం బహ్రెయిన్ నుంచి వచ్చిన సోహెల్.. భార్య, కూతురును త్వరలోనే ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. వారిని చూడకుండానే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment