
కష్టపడే అధికారులకే ఉజ్వల భవిష్యత్
● సింగరేణి సీఎండీ ఎన్.బలరాం
గోదావరిఖని: సింగరేణి ఉన్నతికి అహర్నిశలు శ్రమించేవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ప్రతీ విభాగ అధిపతి వచ్చే పదేళ్లకు సరిపడా భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయాలని సంస్థ సీఎండీ ఎన్.బలారం సూచించారు. సోమవారం అన్ని ఏరియాల జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో విడివిడిగా సమావేశమైయ్యారు. లక్ష్య సాధనలో ఉద్యోగులను భాగస్వాములను చేయాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారికి స్థానం ఉండదని స్పష్టం చేశారు. ఏరియాలకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి గురించి అడిగి తెలుసుకొని రానున్న 43 రోజుల్లో మిగిలిన లక్ష్యాలను సాధించాలన్నారు.
రోజూ 2.60లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
వార్షిక లక్ష్యాలు సాధించడానికి రోజూ 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలని బలరాం సూచించారు అలాగే 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని తెలిపారు. రక్షణ, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో రవాణా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతన గనుల విషయంలో అపరిష్కృతంగా ఉన్న భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై త్వరితగతిన వచ్చేలా చూడాలని కార్పొరేట్‌జీఎంలను ఆదేశించారు. కార్మికుల్లో నైపుణ్యం పెంపుదల, గనుల్లో మ్యాన్ రైడింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, గైర్హాజర్ నివారించేలా కౌన్సిలింగ్ నిర్వహించాలను తద్వార ఉత్పత్తి పెంచే వీలుంటుందని అన్నారు.
మస్టర్ పడి బయటకు వెళ్లేవారిపై చర్యలు
మస్టర్ పడి బయటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం ఆదేశించారు. అలాగే ప్రతీ ఉద్యోగి విధులకు సకాలంలో వచ్చేలా చూడాలని, గ్రేస్ టైమ్ వరకు మస్టర్ నమోదుకు అనుమతించొద్దన్నారు. సమావేశంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణ(ఈ అండ్ ఎం), ఎల్‌వీ.సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వేంకటేశ్వర్లు (పీఅండ్ పీ), అడ్వైజర్(ఫారెస్ట్రీ) మోహన్‌పర్గేన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్‌డీఎం. సుభానీ, జీఎం(సీపీపీ) మనోహర్, జీఎం(మార్కెటింగ్) డి.రవిప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment