
కాకతీయ కెనాల్‌లో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం
తిమ్మాపూర్: మండలంలోని అల్గునూర్ శివారులోని కాకతీయ కెనాల్‌లో దూకి ఓ వివాహిత సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. వెంట వచ్చిన భర్త ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు. ఇద్దరూ కాలువలో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు వారి ప్రాణాలు కాపాడారు. ఎల్‌ఎండీ ఎస్‌ఐ వివేక్ తెలిపిన వివరాలు.... కరీంనగర్ కార్పొరేషన్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెద్దాపురం శ్రావణి, భర్త లక్ష్మణ్‌తో గొడవ పడి ఇంట్లోనుంచి బయటకు వెళ్లింది. ఆమె వెంటే భర్త వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం కాకతీయ కెనాల్ వద్దకు చేరుకుని అందులో దూకింది. వెంటనే ఆమెను కాపాడేందుకు లక్ష్మణ్ కూడా కాలువలో దూకాడు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు గమనించి వెంటనే వారిని కాపాడారు. నీటి ప్రవాహంలో యువతి కొద్ది దూరం కొట్టుకుపోవడంతో అపస్మారకస్థితికి చేరుకుంది. సదరు యువతిని హుటాహుటినా హాస్పిటల్‌కు తరలించారు. శ్రావణి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రాణాలు కాపాడం....
కాలువ వద్ద జనాలు ఉండటం చూసి ఏం జరిగిందోనని చూస్తే మహిళ కెనాల్‌లో కొట్టుకుపోవడం కనిపిచింది. అందరూ కేకలు వేస్తున్నారు ఎవరూ కాపాడేందుకు ధైర్యం చేయడం లేదు. నేను వెంటనే కెనాల్‌లో దుకాను నన్ను చూసి మరో యువకుడు సైతం కాలువలో దూకుడు. ఇద్దరం కలిసి మహిళాను బయటకు తీసుకువచ్చాం. ప్రాణాలతో ఉందని తెలియగానే ఆనందం వేసింది. – రెడ్డవేణి లక్ష్మణ్
ప్రాణాలు తెగించి కాపాడిన ఇద్దరు వ్యక్తులు

కాకతీయ కెనాల్‌లో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment