గురుకుల టీచర్ల సమస్యలు పరిష్కరిస్తా
● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య
కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ గురుకులాలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో అనేక సమస్యలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య తెలిపారు. ఆయా గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు, అధ్యాపకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపిస్తే రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసేలా ప్రభుత్వంతో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా నిలిచిన గురుకులాల విద్యార్థులు సాధించిన విజయాల వెనుక ఉన్న ఉపాధ్యాయుల శ్రమను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తనను ఎమ్మెల్సీగా మండలికి పంపితే.. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల భారం తగ్గించి స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించేలా ప్రభుత్వంతో పోరాటం చేస్తానని, రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న వారికి కనీస వేతనాల అమలుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ
పాలకుర్తి(రామగుండం): పుట్నూర్, కుక్కలగూడూర్ గ్రామ శివారుల్లోని రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఆదివారం రాత్రి చోరీ చేశారు. 25 కేవీ సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లను పగులగొట్టి అందులోని కాపర్‌వైర్‌ను దొంగలు అపహరించారు.
Comments
Please login to add a commentAdd a comment