రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్ సిరిసిల్ల
సిరిసిల్ల: రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో రాజన్నసిరిసిల్ల జట్టు చాంపియన్‌గా నిలిచింది. జిల్లా కేంద్రంలోని సాయికృష్ణ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం రాష్ట్ర స్థాయి కుంగ్‌ఫూ కరాటే పోటీలు ముగిశాయి. రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన కరాటే ఆల్ స్టైయిల్ కుంగ్‌ఫూ క్రీడాకారులు పాల్గొన్నారు. అన్ని విభాగాల్లో 286 ఈవెంట్లతో రాజన్నసిరిసిల్ల జిల్లా చాంపియన్‌షిప్ దక్కించుకుంది. 96 ఈవెంట్లతో కరీంనగర్ జిల్లా ద్వితీయ, 84 ఈవెంట్లతో మంచిర్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. బ్లాక్‌బెల్ట్ విభాగంలో బాలుర బాలికల స్పారింగ్‌లో బ్రౌన్, బ్లాక్‌బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్‌షిప్ బాలుర విభాగంలో మంచిర్యాల జిల్లా విద్యార్థి శ్రీకాంత్, బాలికల బ్రౌన్ మరియు బ్లాక్ బెల్ట్ గ్రాండ్ చాంపియన్‌షిప్ స్పారింగ్‌లో మంచిర్యాల జిల్లా విద్యార్థిని సౌమ్య గ్రాండ్ చాంపియన్‌షిప్ గెలుపొందారు. మాస్టర్ రాజేశం, హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛందసంస్థ ఫౌండర్ కనుకుంట్ల పున్నంచందర్, పండ్రాల లింగమూర్తి, కరాటే మాస్టర్ వడ్నాల శ్రీనివాస్, సీనియర్ మాస్టర్ రాజమల్లు, శ్రీధర్, సదానందం, అక్కనపెల్లి వినోద్, విక్రమ్, బొల్లోజి శ్రీనివాస్, స్వప్న, వొడ్నాల అన్నపూర్ణ, ప్రియాంక, నివేదిత వేణు, ప్రవళిక, కనకప్రసాద్, రాకేశ్ పాల్గొన్నారు.
రెండో స్థానంలో కరీంనగర్
సిరిసిల్లలో ముగిసిన కరాటే పోటీలు..
Comments
Please login to add a commentAdd a comment