ఆధునిక పద్ధతిలో బోధించాలి
సైదాపూర్(హుస్నాబాద్): విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో విద్యా బోధన చేయాలని కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు డీఈవో జనార్దన్‌రావు సూచించారు. సోమవారం వెన్నంపల్లి ఆంగ్ల బోధన కాంప్లెక్స్ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం ప్రభాకర్‌రెడ్డి, ఆర్పీలు ప్రవీణ్‌కుమార్, సరిత, తిరుపతిరెడ్డి, పవన్‌కుమార్, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జైలుశాఖ ఉద్యోగుల ప్రతిభ
కరీంనగర్‌క్రైం: తెలంగాణ జైళ్ల శాఖ 7వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు హైదరాబాద్‌లో జరుగగా జిల్లా జైలు ఉద్యోగులు సత్తాచాటారు. జిల్లా జైలు నుంచి 17 మంది ఉద్యోగులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కరాటే, లాంగ్‌జంప్, 800 మీటర్లు, టీం కరాటే, మిమిక్రీ విభాగాల్లో ఆరు బంగారు పతకాలు గెలుచుకున్నారు. అలాగే హైజంప్, 100 మీటర్లు, 400 మీటర్లు, కరాటే, బాస్కెట్ బాల్, ఫొటోగ్రఫీ, వ్యాసరచన విభాగాల్లో 12 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. ఈసందర్భంగా పతకాలు గెలుచుకున్న సిబ్బందిని పర్యవేక్షణ అధికారి జి.విజయ డేని, జిల్లా జైలు మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్, జైలర్ పి.శ్రీనివాస్, బి.రమేశ్, డిప్యూటీ జైలర్స్ ఎ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.సుధాకర్‌రెడ్డి, ఎల్.రమేశ్, అజయ్‌చారి తదితరులు అభినందించారు.
కంటి పరీక్ష శిబిరాల సందర్శన
కరీంనగర్‌టౌన్: పాఠశాలల విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే టీంల ద్వారా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న కంటి పరీక్ష శిబిరాలను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సందర్శించారు. కరీంనగర్‌లో 101 మంది విద్యార్థులు, హుజూరాబాద్‌లో 126 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఆయా ఆస్పత్రుల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, డాక్టర్ సా జీదా అతహరి, సనా జవేరియా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతిలో బోధించాలి
ఆధునిక పద్ధతిలో బోధించాలి
Comments
Please login to add a commentAdd a comment