ఫోన్ చేస్తే ఎత్తడు
మొదటి నుంచి అంతే..
● ఏడాది క్రితం ఇక్కడ పనిచేసిన ఎకై ్సజ్ సీఐకి స్థానిక మద్యం వ్యాపారులతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను బదిలీ చేసి.. పెద్దపల్లిలో పని చేస్తున్న వినోద్‌రాథోడ్‌ను నియమించారు.
● ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, ఫోన్ చేసినా స్పందించరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
● గతంలో ఇక్కడ సీఐలుగా పని చేసిన ఏ అధికారి కూడా ఇలా వ్యవహరించకపోవడం గమనార్హం.
● రోజులు తరబడి విధులకు డుమ్మా కొడుతున్న సీఐ తీరుపై ఉన్నతాధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు.
అనేక ఆరోపణలు
● విధులకు సక్రమంగా హాజరు కాని సీఐ మద్యం, బెల్టు వ్యాపారుల నుంచి మామూళ్లు మాత్రం వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
● దీనివల్లనే మద్యం వ్యాపారులు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి.
● ప్రధానంగా పట్టణంలోని కొన్ని మద్యం దుకాణాల వద్ద రోడ్ల పక్కన మద్యం సేవిస్తున్నారు. దీనివల్ల అటు వైపు నుంచి వెళ్లడానికి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● దీనిని దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా మద్యం సేవించడాన్ని అరికట్టాలని పలువురు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు.
● అలాగే ఇటీవల బెల్టు దుకాణాలకు మందు సరఫరా చేసే విషయంలో పట్టణ మద్యం, బార్ వ్యాపారుల మధ్య విభేధాలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో ఎకై ్సజ్ సిబ్బంది మద్యం వ్యాపారుల సూచనతో కొన్ని బెల్టు దుకాణాలపై దాడులు చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కనీసం కేసు నమోదు చేయలేదని తెలిసింది.
● ఈ ఒక్కటే కాదు.. బెల్టు దుకాణాల నుంచి తరుచుగా స్వాధీనం చేసుకుంటున్న మద్యాన్ని రికార్డుల్లో చూపకుండా ఆ తర్వాత లైసెన్స్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఐపై చర్యలు తీసుకోవాలని
కాంగ్రెస్ డిమాండ్
● సీఐ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే కాకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ప్రకటన విడుదల చేసిన నాయకులు.. రెండోరోజైన మంగళవారం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి సీఐ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఐ వినోద్‌రాథోడ్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.
విచారణ జరిపిస్తాం
సీఐ వినోద్‌రాథోడ్‌పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై విచారణ జరుపుతాం. ఎక్కడైనా సమస్యలుంటే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలి. నా దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటాం.
– సత్యనారాయణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్
అందుబాటులో ఉండడు..
మెట్‌పల్లి ఎకై ్సజ్ సీఐ వినోద్‌రాథోడ్ తీరుపై విమర్శలు
అతడిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకుల డిమాండ్
మెట్‌పల్లి: ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వరిస్తూ.. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాల్సిన
మెట్‌పల్లి ఎకై ్సజ్ సీఐ వినోద్ రాథోడ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు
వెల్లువెత్తుతున్నాయి. విధులను నిర్లక్ష్యం చేస్తూ.. అందుబాటులో ఉండకపోవడం.. సమస్యలపై
ఎవరైనా ఫోన్‌లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే స్పందించకపోవడం వివాదానికి దారితీస్తోంది.
ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్న ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని
ఏకంగా అధికార కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment