రాములపల్లిలో కుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

రాములపల్లిలో కుల బహిష్కరణ

Published Wed, Feb 19 2025 1:46 AM | Last Updated on Wed, Feb 19 2025 1:42 AM

రాములపల్లిలో కుల బహిష్కరణ

రాములపల్లిలో కుల బహిష్కరణ

ఎలిగేడు(పెద్దపల్లి): భూవివాదం విషయంతో తమను కుల బహిష్కరణ చేశారని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామానికి చెందిన పలుమారు కొమురయ్య, అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాలు.. ఓ భూవివాదం విషయంలో తన కొడుక్కు సంబంధం ఉందని గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి కులంలోని పెద్ద మనుషులను బెదిరించి తమతో ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నారని మనోవేదనకు గురయ్యారు. రెండురోజుల క్రితం ఇంట్లో మల్లన్న పట్నాలు వేసేందుకు బంధువులను పిలిపించుకున్నామని కానీ, ఓ పెద్దమనిషి ఒగ్గు కళాకారులను బెదిరించడంతో వారు పట్నం వేయకుండానే వెళ్లిపోయారని, పొలం పనులకు సైతం ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబసభ్యులతో ఎవరు మాట్లాడిన పదివేల రూపాయల జరిమానా విధిస్తామని ఓ పెద్దమనిషి కులంలో ఇంటింటికీ తిరిగి చెప్పించారని అన్నారు. బహిష్కరణపై జూలపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సై సనత్‌కుమార్‌ను వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇంకా ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు రాగానే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement