ఇదేం పద్ధతి..!
● లారీలు విడిపించుకునేందుకు వస్తే తిడతారా..?
● ఆర్టీఏ ఆఫీస్‌లో లారీ యజమాని ఆందోళన
● డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణ
● తమపైనే దాడి చేశాడన్న ఆర్టీఏ సిబ్బంది
సిరిసిల్లక్రైం: అధికలోడ్‌తో వెళ్తున్న రెండు లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారని, వాటిని వదిలిపెట్టేందుకు ఒక్కో లారీకి రూ.30 వేలు చొప్పున డీటీవో పర్సనల్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడని లారీ యజమాని మంగళవారం కార్యాలయంలో ఆందోళన చేపట్టాడు. తనను సిబ్బంది తిట్టారని ‘ఇదేం పద్ధతి’ అంటూ ప్రశినంచాడు. వివరాలు.. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన నాగరాజు.. తన రెండు లారీలు ఫ్లైయాష్ లోడ్‌తో సిరిసిల్లకు వస్తున్న క్రమంలో అధిక లోడ్ ఉందని ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు. లారీలను విడిపించేందుకు నాగరాజు ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చే క్రమంలో డీటీవో పీఏ డబ్బు డిమాండ్ చేశాడ ని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని డీపీవో కు తెలిపి వాహనాలను విడిపించుకునేందుకు ఆరీ ్టఏ కార్యాలయానికి బాధితుడు చేరుకోగా అక్కడ ఉన్న సిబ్బంది దుర్భాషలాడారు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజుకు సిబ్బందికి వాగ్వాదం జరిగింది. తనను దుర్భాషలాడటంతోనే కోపానికి వచ్చినట్లు లారీ యజమాని మీడియా ఎదుట తన ఆవేదన వెల్లడించాడు. కాగా, లారీ యజమాని మద్యం తాగి సిబ్బందిపై దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
నిబంధనల ప్రకారం జరిమానా చెల్లిస్తా
లారీలో ఓవర్ లోడ్ ఉందని అధికారులు కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం జరిమానా చెల్లిస్తా. కానీ, మధ్యవర్తిగా వేణు అనే వ్యక్తి ఒక్కో లారీకి రూ.30 వేలు అడగడం ఆవేదన కలిగించింది. ఒక్క లారీ లోడ్ అమ్మితే వచ్చేదానికి ఆరింతలు లంచాన్ని ఆర్టీఏ అధికారుల పేరిట అడిగాడు. అధికారులు ఆఫీసులో ఉంటే ప్రైవేట్ వ్యక్తి తనిఖీలు చేయడమేందో అర్థం కాలేదు.
– నాగరాజు, లారీ యజమాని
ఆరోపణలో వాస్తవం లేదు
ఓవర్ లోడ్‌తో ఉన్న లారీలను పట్టుకొని కేసు నమోదు చేశాం. జరిమానా చెల్లిస్తే వాహనాలను వదిలేస్తాం. మా కార్యాలయంలో మధ్యవర్తులుగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరు. మా పేరిట డబ్బులు అడిగితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. పారదర్శకంగా నిబంధనలు అనుసరించి సేవలందిస్తున్నాం.
– లక్ష్మణ్, రవాణాశాఖ అధికారి, సిరిసిల్ల
ఇదేం పద్ధతి..!
ఇదేం పద్ధతి..!
Comments
Please login to add a commentAdd a comment