‘నలిమెల’కు జాతీయ అవార్డు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బహుభాష కోవిదుడు, కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ సిటీ కాలేజ్ మగ్దూం మొహినూద్దీన్ జాతీ య పురస్కారానికి ఎంపికయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన భాస్కర్‌కు 14 భాషల్లో ప్రవేశం కలదు. ఆయన పలు రచనలు వివిధ భాషల్లో అనువాదం అయ్యాయి. ఇటీవల పీవీ నరసింహారావు మెమోరియల్ పురస్కారం అందుకున్నారు. నలిమెల భాస్కర్ వివిధ సాహితీ ప్రక్రియల్లో 25 గ్రంథాలు వెలువరించారని, ఆయన కృషిని గుర్తించి జాతీయ అవార్డు ప్రకటించినట్లు అవార్డు కమిటీ అధ్యక్షుడు, సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాలభాస్కర్ సోమవారం ప్రకటించారు.
పరిహారం ఇప్పిస్తానని కుచ్చుటోపీ
● పూజారిని రూ.30లక్షలకు ముంచిన నకిలీ విలేకరి
శంకరపట్నం: రెవెన్యూ రికార్డుల్లో తక్కువగా నమోదైన ఎకరం భూమితోపాటు ఎస్సారెస్పీ కింద పోయిన భూమికి పరిహారం ఇప్పిస్తానని మాచర్ల రాజయ్య అనే నకిలీ విలేకరి రూ.30 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని పురోహిత్యం చేసుకుంటూ జీవించే వైరాగ్యపు రాజమల్లయ్య తన గోడు వెల్లబోసుకున్నాడు. కేశవపట్నంలో మంగళవారం విలేకరులతో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఆయన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామానికి చెందిన రాజమల్లయ్య పచ్చునూర్, ఊటూర్, గట్టుదుద్దెనపల్లితో పాటు శంకరపట్నం మండలం చింతగుట్ట ఆలయాల్లో పూజారి. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో నివాసం ఉంటున్న మాచర్ల రాజయ్య తల్లి 2023లో మరణిస్తే తన స్వగ్రామం ఊటూర్‌లో దశదినకర్మ చేసేందుకు రాజమల్లయ్య వెళ్లాడు. ఆ సమయంలో రాజయ్య తాను ఓ టీవీ చానల్ విలేకరిగా పరిచయం చేసుకున్నాడు. ఏదైన రెవెన్యూ కార్యాలయంలో పని ఉంటే చేయిస్తానని చెప్పాడు. పచ్చునూరులో తనకున్న ఏడు ఎకరాల్లో ఎకరం భూమి పట్టా కాలేదని చెప్పడంతో రూ.లక్ష ఇస్తే పనులు చేయిస్తానని నమ్మించాడు. దీంతో రాజమల్లయ్య రాజయ్యకు గూగుల్‌పే ద్వారా రూ.లక్ష పంపించాడు. ఎస్సారెస్పీకాలువలో పోయిన భూమల పరిహారం వచ్చిందని, అందుకు సంబంధించిన రూ.96లక్షల ఫేక్‌కాపీ చూపించడంతో విడుతలవారీగా రూ.30లక్షల పైచిలుకు డబ్బులు పంపించాడు. పనులు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి శంకరపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నకిలీ విలేకరిపై విచారణ చేసి, డబ్బులు ఇప్పించాలని కోరాడు.
అంతర్జాతీయ మాతృభాషా సదస్సుకు కొమిరవాసి
ఓదెల: యూనెస్కోలో ఈనెల 24నుంచి 26వరకు జరిగే అంతర్జాతీయ మాతృభాషా సిల్వర్ జూబ్లీ సదస్సుకు ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన కొత్తిరెడ్డి మల్లారెడ్డి ఎంపికయ్యారు. హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మల్లారెడ్డి భారతీయ భాషల కోసం యూనిటైడ్ ఫీమెంట్ ఇంటర్న్‌షిప్ తరహాలో యూనిఫైడ్ లాంగ్వేజ్ ఇంటర్‌షిప్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మల్లారెడ్డిని గ్రామస్తులు అభినందించారు.
గంజాయి పట్టివేత
ధర్మపురి: మండలంలోని మగ్గిడి, దొంతాపూర్ గ్రామాలకు చెందిన యువకులు గంజాయి సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దుర్గం నిశాంత్, కాలువ గంగాధర్, ఎస్‌కె.ఆసిఫ్ నుంచి 829 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.
‘నలిమెల’కు జాతీయ అవార్డు
‘నలిమెల’కు జాతీయ అవార్డు
Comments
Please login to add a commentAdd a comment