విలువిద్యలో జాతీయస్థాయిలో జిల్లా కీర్తి
మంథని: మంథనికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కొమురోజు శ్రీనివాస్ శిక్షణలో జిల్లాలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత విలువిద్య క్రీడలో ప్రపంచ స్థాయిలో రాణిస్తూ జిల్లా కీర్తిని అగ్రదేశానికి వ్యాపింపజేసింది. ఇటీవల ఉత్తరాఖాండ్‌లోని డెహడ్రూన్ జరిగిన 38 జాతీయ క్రీడల్లో మహిళల విభాగంలో తెలంగాణ జట్టుకు ప్లాగ్ బేరర్(పతాక దారిగా) వ్యవహారించడం జిల్లాకే గర్వకారణం.
తండ్రి ప్రోత్సాహం.. కోచ్ మనోధైర్యం
మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ తన కూతురు చికితకు విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తూ వెన్నంటి ఉండి విజయానికి దోహద పడుతున్నాడు. అలాగే మంథనికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలువిద్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్ చికితకు చిన్నతనం నుంచి కోచ్‌గా, అడ్వయిజర్‌గా వ్యవహరిస్తూ తన విజయానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు.
జాతీయ స్థాయి శిక్షకుల పర్యవేక్షణలో శిక్షణ
ప్రస్తుతం ఎన్‌సీవోఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సోనీపట్‌లో జాతీయ స్థాయి శిక్షకుల పర్యవేక్షణలో చికిత శిక్షణ పొందుతోంది. భారత మహిళల జట్టులో స్థానం సంపాదించి వరల్డ్, కప్ స్జేడ్ వన్, స్టేజ్‌కు ఽఈనెల 26న అమెరికా, చైనాలో జరిగే ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికై ంది. అంతేగాకుండా జూనియర్ ఆసియా కప్ జట్టుకు కూడా ఎంపిక కావడం విశేషం. గతేడాది గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లోనూ విలువిద్య విభాగంలో బంగారు పతకం సాధించింది. కాగా చికిత విజయాలను అభినందిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు రూ.10లక్షలు ఏదేళ్ల పాటు నెలకు రూ.15 వేల చొప్పున ఉపకారవేతనం అందించేదుకు ముందుకు వచ్చినట్లు కొమురోజు శ్రీనివాస్ తెలిపారు. తాను చిన్నతనం నుంచి విద్య నేర్పిన క్రీడాకారిణి ప్రపంచస్థాయికి ఎదగడంపై ఎంతగానో గర్వపడుతున్నట్లు తెలిపారు.
అమెరికాలో జరిగే ప్రపంచ స్థాయి క్రీడలకు చికిత
38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్టుకు ప్లాగ్ బేరర్
Comments
Please login to add a commentAdd a comment