
పాలకుర్తి: బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీడీనగర్‌లో శివరాత్రి పోచమ్మ(65)ను హత్యచేసిన నిందితుడు ధర్మపురి శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. జీడీనగర్‌లో నివాసముంటున్న పోచమ్మ భర్త 20ఏళ్ల క్రితమే మృతిచెందగా.. కుమారుడు అంజి రామగుండంలో ఉంటున్నాడు. పోచమ్మ బీసీ కాలనీలో బిక్షాటన చేసుకుంటూ జీవిస్తోంది. అదేకాలనీలో నివాసముండే ధర్మపురి శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో పదేళ్ల క్రితమే అతని భార్య వదిలిపెట్టి పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది, ఈనేపథ్యంలో పోచమ్మ, శ్రీనివాస్‌ల మధ్య పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.
ఇద్దరు కలిసి రోజూ జీడీనగర్‌కు వెళ్లి గుడుంబా తాగుతుండే వారు. అయితే కొద్ది రోజులుగా పోచమ్మ తన ఇంటి సమీపంలో ఉండే పర్వతి కిష్టయ్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన శ్రీనివాస్ పోచమ్మను మందలించాడు. అయితే తాను ఇష్టమున్న వారితో మాట్లాడుతానని పోచమ్మ ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో అసహనానికి గురైన శ్రీనివాస్ పోచమ్మను హత్యచేయాలని నిర్థారించుకున్నాడు. దీనిలో భాగంగానే ఈనెల 9న సాయంత్రం ఇద్దరు కలిసి జీడీనగర్‌లో గుడుంబా తాగడానికి వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో శ్మశానవాటిక వద్దకు చేరుకోవడంతో శ్రీనివాస్ పోచమ్మతో కావాలనే గొడవకు దిగాడు. పథకం ప్రకారం ముందే సిద్దం చేసుకున్న కర్రతో పోచమ్మ తలపై గట్టిగా కొట్టడంతో మద్యం మత్తులో ఉన్న పోచమ్మ కిందపడి పోయింది.
దీంతో పోచమ్మ చనిపోయిందని భావించిన శ్రీనివాస్ శ్మశానవాటిక లోపలికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఏమి తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఈనెల 14న శ్మశానవాటిక వద్ద సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి లభించిన ఆధార్‌కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా మృతదేహం పోచమ్మది గుర్తించి పంచనామా నిర్వహించారు. మృతురాలి కుమారుడు అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బసంత్‌నగర్ ఎస్సై స్వామితో పాటు కానిస్టేబుళ్లు శివకుమార్, సురేశ్, శ్రీనివాస్‌లను పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment