ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తుతా
● ఎమ్మెల్సీగా గెలిపించండి
● టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య
కరీంనగర్‌టౌన్: ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలపై మండలిలో గళమెత్తుతానని టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య అన్నారు. మంగళవారం పలు ఉపాధ్యాయ సంఘా ల బాధ్యులు కరీంనగర్‌లో సమావేశమై, ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. కొమురయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారించేలా మండలిలో ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. పీఆర్సీ, డీఏ, జీపీఎఫ్, శిశు సంరక్షణ సెలవుల పెంపు, 20 ఏళ్ల సర్వీస్‌కే పూర్తి పెన్షన్, అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫారసులను గత సర్కారు అమలు చేయలేదని మండిపడ్డారు.
బీసీ సంఘాల మద్దతు..
టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మంగళవారం కరీంనగర్‌లో ఆయనను కలిసి, మద్దతు ప్రకటించారు. కొమురయ్యను గెలిపించుకొని, చట్టసభలకు పంపిస్తే బీసీ వాదం బలపడుతుందన్నారు. త్వరలో బీసీల రాజ్యాధికారం వస్తుందని, 2028 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ అని పేర్కొన్నారు. కొమురయ్య మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment