‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: పదోతరగతి పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై మంగళవారం ఎంఈవోలతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది పదోతరగతి డ్రాపవుట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి పరీక్షలు పూర్తయ్యే వరకు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరాలన్నారు. నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారుచేసి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలన్నారు. సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో జనార్దన్‌రావు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కశ్మీర్‌గడ్డలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్‌ను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్‌తో కలిసి మంగళవారం రాత్రి సందర్శించారు. మెస్, బాలికల వసతిగదులు, ఆర్వోవాటర్ ప్లాంటును పరిశీలించారు. మెనూ ప్రకారం పోషకాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అన్ని హాస్టళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నామని, కామన్ డైట్ మెనూ ద్వారా సమతుల పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే కెరియర్ ఆప్షన్ చాట్‌ను ఆవిష్కరించారు. ఆర్డీవో మహేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఈడీ నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, హాస్టల్ ప్రత్యేక అధికారి రాంబాబు, వార్డెన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment