బిట్టుపల్లి శివారులో పెద్దపులి ప్రత్యక్షం
మంథని: తోడు కోసం సుమారు 20 రోజులుగా అన్వేషిస్తున్న ఆడపులి.. శనివారం పొద్దుపోయిన తర్వాత మంథని మండలం బిట్టుపల్లి శివారులో ప్రధాన రోడ్డు దాటింది. సమీపంలోని పంట పొలం వద్ద ఓ రైతు దానిని చూసి ఆందోళనకు గురయ్యాడు. ఆ తర్వాత విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల నుంచి మంథని అడవుల్లోకి వచ్చిన పులి.. మూడు రోజుల క్రితం ముత్తారం మండలంలో సంచరించినట్లు అటవీశాఖ అధికారులు అడుగులను గుర్తించారు. అటు తర్వాత జాడ లేకుండా పోయింది. ఆ తర్వాత హఠాత్తుగా మంథని మండలం ఎక్లాస్‌పూర్– ముత్తారం మండలం ఖమ్మంపల్లి రహదారి దాటి బిట్టుపల్లి వైపు వెళ్లడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. పెద్దపులి సంచారంపై గ్రామ కార్యదర్శి దండారో వేయించడంతో ఇళ్లు విడిచి గ్రామస్తులు రోడ్డుపైకి చేరారు. అటవీ శాఖ అధికారుకు సమచారం అందించంతో అక్కడకు చేరుకొని పులి పాదముద్రలు గుర్తించారు. అంతేగాకుండా జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య చేరుకొని పాదముద్రలను పరిశీలించారు.
పులి వచ్చేసింది
వేములవాడరూరల్: కొండాపూర్, ఫాజుల్‌నగర్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పులి ఆనవాళ్లను శనివారం గుర్తించారు. వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్‌లో ఉప్పరి నారాయణకు చెందిన గేదైపె రెండు రోజుల క్రితం దాడిచేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఫారెస్టు అధికారులు గేదైపె దాడి చేసింది పులి అని నిర్ధారించారు. కొడిమ్యాల మండలం కొండాపూర్ ఫారెస్ట్ నుంచి ఫాజుల్‌నగర్ అటవీ ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు. ఎఫ్‌ఆర్‌వో కలీలొద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పులి తిరుగుతోందని రైతులు పొలం పనుల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రోడ్డు దాటుతుండగా గమనించిన రైతు
పాదముద్రలు గుర్తించిన
ఫారెస్టు అధికారులు
పరిశీలించిన జిల్లా అధికారి..
ఆందోళనలో ప్రజలు
బిట్టుపల్లి శివారులో పెద్దపులి ప్రత్యక్షం
Comments
Please login to add a commentAdd a comment