మహిళ మెడలోంచి చైన్ చోరీ
మెట్‌పల్లిరూరల్: ఎల్లమ్మతల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మె ట్‌పల్లి మండలంలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపల్లికి చెందిన దొడ్డ రమ్య, నర్సయ్య దంపతులు మంగళవారం వెల్లుల ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని వంట చేసుకునే క్రమంలో వెల్లుల వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన దు ండగుడు రమ్య మెడలోని రెండున్నర తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లాడు. భక్తుల సమాచా రంతో మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది ఆలయం వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తికి చెందిన మతులపురం రాజం (55) అప్పుల బాధతో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజంకు ఎకరంన్నర సొంత భూమి ఉంది. దాంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయా యి. ఈ క్రమంలో తనకున్న ఎకరం భూమి అమ్మి కొంత అప్పు చెల్లించాడు. ఇంకా రూ.10లక్షల వరకు అప్పు ఉంది. ఆ మొత్తం ఎలా చెల్లించాలా అని నిత్యం మదనపడుతున్నాడు. మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సదాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment