ధీర సునీత రాకకోసం.. | - | Sakshi
Sakshi News home page

ధీర సునీత రాకకోసం..

Published Wed, Mar 19 2025 12:46 AM | Last Updated on Wed, Mar 19 2025 12:44 AM

ధీర స

ధీర సునీత రాకకోసం..

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): క్షణమొక యుగం.. అ యినా మొక్కవోని ఆత్మవిశ్వాసం... గడ్డు పరిస్థితులు జయించి సుదీర్ఘకాలం తరువాత నేడు భూమి మీద అడుగుపెట్టనున్నారు భారతి సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌. అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో 9 నెలల 13 రోజుల పాటు (287 రోజు లు) మనోధైర్యంతో గడిపి, భూమిపైకి దిగనున్నా రు. 2024 జూన్‌ 5న స్టార్‌ లైనర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఐ ఎస్‌ఎస్‌కు చేరుకోగా 8 రోజుల్లోనే తిరిగి రావాలి కాని స్టార్‌ లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కా రణంగా రాలేకపోయారు. సెప్టెంబర్‌ 7న స్టార్‌ లైన ర్‌ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. దీంతో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సునీతా విలీయమ్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్న, సైన్స్‌రంగంలో రాణిస్తున్న పలువురు విద్యార్థుల అభిప్రాయాలు..

కోట్లాది మందికి ప్రేరణ

సుస్వాగతం సునీతా విలియమ్స్‌కు. మీ అద్భుతమైన ప్రయాణం కోట్లాది మంది విద్యార్థులకు ప్రేరణ కలిగించింది. అంతరిక్ష యానంలో మీరు చూపించిన తెగువ, పట్టుదల, మాలాంటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. మేం ఇటీవల పుదుచ్చెరిలో జరిగిన సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచాం. సునీత స్ఫూర్తితో భవిష్యత్‌లో మరింతగా రాణిస్తాం.

– వర్షిణి, వాగ్దేవి, జెడ్పీహెచ్‌ఎస్‌ (గర్ల్స్‌) మెట్‌పల్లి

మనకు గర్వకారణం

భారతీయ సంతతి సునీత విలియమ్స్‌ తొమ్మిది నెలలుగా అంతరిక్ష యానం నుంచి దిగ్విజయంగా భూమి మీదికి వస్తున్న సందర్భంగా చాలా హ్యపీగా ఉంది. మన దేశ వనితగా చెప్పుకోవడం గర్వకారణం. నాకు సైన్స్‌ ఉంటే చాలా ఇష్టం. రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్లలో, ఇస్రో నిర్వహిస్తున్న సైన్స్‌క్విజ్‌ల్లో పాల్గొంటున్నాను. సునీతా విలీయమ్స్‌ స్ఫూర్తిగా ఇంకా రాణిస్తా.

– అఫ్సా మహెవీశ్‌,

జెడ్పీహెచ్‌ఎస్‌, ఇందుర్తి, కరీంనగర్‌

గొప్ప ఆవిష్కరణ చూశాం

సునీత విలియమ్స్‌ భూమి మీదకు చేరుకోవడం చాలా సంతోషం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ఎదిగినామో అనడానికి ఇది ఉదాహరణ. ఒక మహిళలో ఇంత సాహసం నన్ను ఆశ్చర్య పరిచింది. ఆడవాళ్లు సున్నితంగా ఉంటారు అన్నది ఒక అభిప్రాయం మాత్రమే. పాఠంలో ఎన్నో విషయాలు చదివాం. కానీ మా కాలంలో ఇలాటి గొప్ప ఆవిష్కరణ చూడగలిగాం.

– పి.హర్షవల్లిక, జెడ్పీహెచ్‌ఎస్‌, రుక్మాపూర్‌, కరీంనగర్‌

మహిళా పరిశోధకులకు ఆదర్శం

హైదరాబాద్‌లో జరిగిన ఇస్రో యువికా–2024, విజయవాడలో జరిగిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన–2024లో పాల్గొ న్నా. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియ మ్స్‌ 9 నెలల సుదీర్ఘ కాలం తర్వాత నేడు భూమిపైకి సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. ప్రప ంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళా పరిశోధకులకు ఆమె ఆదర్శంగా నిలస్తారనడంలో సందేహం లేదు.

– రంగు కీర్తన, జెడ్పీహెచ్‌ఎస్‌, రాగినేడు, పెద్దపల్లి

ఎంతో స్ఫూర్తిదాయకం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఖగోళ శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు సునీత స్ఫూర్తి దాయకం. భవిష్యత్‌లో మరిన్ని పరిశోధనలు చేయాలని కోరుకుంటుున్నా. నేను 2025 ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌ జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికై నందుకు ఆనందంగా ఉంది. – పి.అభిలాష్‌,

జెడ్పీహెచ్‌ఎస్‌, నంది మేడారం, పెద్దపల్లి

మొక్కవోని ఆత్మవిశ్వాసం

2006 ఫస్ట్‌ అంతరిక్ష యాత్ర, 2012లో రెండోసారి అంతరిక్ష యాత్ర, 2024లో మూడోసారి అంతరిక్ష యాత్ర ఇలా మూడు సార్లు అంతరిక్ష యాత్ర చేయడం ఎంతో సహసంతో కూడుకున్నది. మొక్కవోని ఆత్మవిశ్వాసం సునీతా విలియమ్స్‌ది. ఆమె మాదిరిగా సైన్స్‌లో రాణించాలని ఉంది. – కంది శ్రీనికరెడ్డి,

టీజీమోడల్‌ స్కూల్‌, సుందరగిరి (కరీంనగర్‌)

ఎటుచూసినా విలియమ్స్‌ మాట

రావమ్మా...సునీతమ్మా అంటూ..

విద్యార్థుల్లో రెట్టింపు ఉత్సాహం

No comments yet. Be the first to comment!
Add a comment
ధీర సునీత రాకకోసం..1
1/6

ధీర సునీత రాకకోసం..

ధీర సునీత రాకకోసం..2
2/6

ధీర సునీత రాకకోసం..

ధీర సునీత రాకకోసం..3
3/6

ధీర సునీత రాకకోసం..

ధీర సునీత రాకకోసం..4
4/6

ధీర సునీత రాకకోసం..

ధీర సునీత రాకకోసం..5
5/6

ధీర సునీత రాకకోసం..

ధీర సునీత రాకకోసం..6
6/6

ధీర సునీత రాకకోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement