క్వింటాల్ పత్తి రూ.7,230
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటాల్‌కు రూ.7,140 ఉండగా రూ.90 పెరిగి మంగళవారం గరిష్ట ధర రూ.7,230 పలికింది. మార్కెట్‌కు నాలుగు వాహనాల్లో 53 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,100, కనిష్ట ధర రూ.6,900కు ప్రైవే టు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 6,7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ రీజనల్ కో ఆర్డినేటర్ ఎం.అంజలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌లో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment