ఎన్‌ఎఫ్‌టీఈ నూతన కార్యవర్గం ఎన్నిక
సప్తగిరికాలనీ(కరీంనగర్): భారత్ సంచార్‌నిగం లిమిటెడ్ గుర్తింపు యూనియన్ ఎన్‌ఎఫ్‌టీఈ ఉమ్మడి జిల్లా తొమ్మిదో వార్షిక సమావేశం స్థానిక ఫిలిం భవన్‌లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా యూనియన్ జాతీయనాయకుడు రాజమౌళి, ఉమ్మడి జిల్లా డిప్యుటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమస్యలు, కార్మిక హక్కులు, ప్రభుత్వరంగ సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి సరికాదన్నారు. అనంతరం నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా ఎన్‌ఎఫ్‌టీఈ బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా అధ్యక్షుడిగా రామినేని పని రాజారావు, ప్రధాన కార్యదర్శిగా లింగాచారి, ట్రెజరర్‌గా నీలం రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment