
ఇల్లందకుంట రాములోరికి నృసింహుని నుంచి పట్టువస్త్రాలు
ధర్మపురి: కరీంనగర్ జిల్లాలో అపర భద్రాదిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంటలో గల శ్రీసీతా రాముల వారి కల్యాణానికి ధర్మపురి శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం పక్షాన శనివారం పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇల్లందకుంటలో ఆదివారం నిర్వహించనున్న స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ నుంచి మేళతాళాలతో తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తదితరులున్నారు.