సాక్షి,బళ్లారి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం బళ్లారికి విచ్చేస్తున్నారు. ఆయన నగర శివార్లలోని కప్పగల్ రోడ్డులో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భారీ ఎన్నికల బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలోని హొసపేటెకు విచ్చేసి భారీ ఎన్నికల బహిరంగ సమావేశంలో ప్రసంగించిన మోదీ, బళ్లారి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని ప్రజలను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ఆయన రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని రాక తరుణంలో జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
స్థానిక పోలీసులతో పాటు మిలిటరీ బలగాలు కూడా నగరంలో మోహరించాయి. సభాస్థలి వద్ద ఎస్‌పీజీ భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలను మోదీ సమావేశానికి సమీకరించేందుకు, దాదాపు 80 వేలకు పైగా కుర్చీలను సభాస్థలి వద్ద ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, గ్రామీణ అభ్యర్థి శ్రీరాములు, నగర బీజేపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మోదీతో పాటు పలువురు కేంద్ర బీజేపీ నాయకులు కూడా పాల్గొంటున్నారు.
చిక్కలో మంత్రి నిరసన
క్కబళ్లాపురం: భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడంపై మంత్రి సుధాకర్, బీజేపీ కార్యకర్తలు గురువారం శిడ్లఘట్ట సర్కిల్‌లో ధర్నా చేశారు. ఉగ్రవాద సంస్థలను ఇప్పటికే కోర్టు, కేంద్రం నిషేధించాయి, భజరంగదళ్‌తో కాంగ్రెస్‌కు ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. దేశాన్ని రక్షించేది భజరంగదళం, ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్య పునాది
ప్లి: ప్రజాప్రభుత్వ వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో ప్రాముఖ్యమని మున్సిపల్ ముఖ్యాధికారి డాక్టర్ శివలింగప్ప తెలిపారు. గురువారం ఆయన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓటరు జాగృతి అభియాన్ జాతాను ప్రారంభించి మాట్లాడారు. జాతాలో వాడవాడల్లో పర్యటించి ఓటు హక్కుపై జాగృతి కల్గించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, సంఘం సంస్థ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment