బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో దేవనహళ్ళి, హొసకోట, నెలమంగల, దొడ్డబళ్లాపుర నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో, సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి సాయంత్రం 5–15 వరకు దేవనహళ్ళిలో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తరువాత బెంగళూరుకు చేరుకుని ఒక హోటల్‌లో పార్టీ నాయకులతో సమావేశమవుతారు. సీఎం బొమ్మై, యడియూరప్ప, ధర్మేంద్ర ప్రధాన్, అరుణ్‌సింగ్ తదితరులు పాల్గొంటారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.
29న బెంగళూరులో ప్రధాని భారీ రోడ్‌షో
జేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఈనెల 29న భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. బెంగళూరు, దావణగెరె, కల్బుర్గితో పాటుగా ఇతర చోట్ల తొలి విడత ప్రచారం చేపట్టనున్న మోదీ, అనేక చోట్ల రోడ్ షో, బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు తెలిసింది. బెంగళూరు తరువాత కల్బర్గి, దావణగెర, హుబ్లీలో భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించే అవకాశం ఉంది.
ప్రతి విధానసభ నియోజకవర్గాలకు 10 నుంచి 20 వేల మంది కార్యకర్తలను తీసుకురావాలని పార్టీ సూచించింది. 10కి పైగా విధానసభ నియోజక వర్గాలను లక్ష్యంగా పెట్టుకొని మోదీ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టనున్నారు. కోలారు, మైసూరు, సంతెమరహళ్లి, తుమకూరు, హాసనతో పాటుగా ఈసారి మైసూరులో మోదీ ప్రచారం చేపట్టనున్నాన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment