దగ్ధమైన ఇంటిని, వస్తు సామగ్రిని చూపిస్తున్న బాధితురాలు మహేశ్వరి
పావగడ: దేవుని వద్ద ఉంచిన దీపం కింద పడి ఇంట్లో మంటలు వ్యాపించి వస్తు సామగ్రి కాలి బూడిదైంది. ఈ సంఘటన శనివారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతం లో చోటు చేసుకుంది. పావగడ పట్టణంలోని కోర్టు వెనుక భాగం గుట్టహళ్ళి ప్రాంతానికి చెందిన మహేశ్వరి రోజూ మాదిరిగా దేవుని పటాల వద్ద దీపం వెలిగించింది. ఆమె పనిలో ఉండగా దీపం కింద పడి బట్టలు అంటుకుని ఆ మంటలు ఇల్లంతా వ్యాపించి వస్తువులు, పరికరాలన్నీ కాలి బూడిదై పోయాయి.
టీవీ, ఫ్యాను, బట్టలు, వంట సామగ్రి, నిత్యావసర సరుకులు ఏవీ మిగలలదేని బాధితురాలు మహేశ్వరి కన్నీటి పర్యంత మైంది. తన భర్త కూడా వదిలి వెళ్లి పోయాడని, కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా బతుకుతున్నానని తెలిపింది. కనీసం తినడానికి కూడా ఏమీ లేదని, దేవుడు తనపై కరుణ చూపించలేదని విలపించింది. తనకు సహాయం చేసి ఆదుకోవాలని దాతలను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment