యశవంతపుర: బెంగళూరు–ధార్వాడ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. సోమవారం తెల్లవారు 5:45 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు ధార్వాడకు చేరనుంది. మధ్యాహ్నం 1:15కు ధార్వాడలో బయలు దేరి రాత్రి 8:10 గంటలకు బెంగళూరుకు చేరుకోనుంది. వారంలో ఆరు రోజుల పాటు బెంగళూరు–ధార్వాడల మధ్య తిరుగుతుంది.
లాంఛనంగా ఈ నెల 26న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. 6 గంటల 55 నిమిషాల వ్యవధిలో ధార్వాడకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎనిమిది బోగీలు ఉండగా 530 మంది ప్రయాణికులను తీసుకెళ్లే దీన్ని మినీ వందే భారత్ రైలుగా పిలుస్తారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో రైల్వే అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment