ధర ఘనం.. దిగుబడి పతనం
రాయచూరు రూరల్: రాష్ట్రానికే తలమానికంగా ఉన్న రాయచూరు ఏపీఎంసీ మార్కెట్‌లో వరి ధాన్యం ధర పెరగగా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 ఉండగా, మార్కెట్‌లో రూ.2600 ధర పలుకుతోంది. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొనడం, తుంగభద్ర ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక పోవడం వల్ల దిగుబడి పతనమై మార్కెట్‌కు వరి ధాన్యం రావడం తగ్గింది. జిల్లాలో రెండు నదులున్నా నారాయణపుర కుడి కాలువ, తుంగభద్ర ఎడమ కాలువ కింద పండించే వరి ధాన్యం సాగు విస్తీర్ణం క్రమేణ తగ్గింది. సోనా మసూరి బియ్యానికి జిల్లా పెట్టింది పేరు. అలాంటి బియ్యానికి కూడా ధర లభించకుండా పోయింది. రాయచూరు, మాన్వి, సింధనూరు, లింగసూగూరు, మస్కి, దేవదుర్గలలో రైతులు వరిని అధికంగా పండించేవారు. ఈ ఏడాది కాలువలకు నీరందక వరి పంటల దిగుబడులు తగ్గాయి. ప్రతి నిత్యం వేలాది బస్తాలు రాయచూరు వ్యవసాయ మార్కెట్‌కు వచ్చి ధాన్యం పడుతున్నా ధరలు మాత్రం రైతుల ఆశలకు అంతం లేకుండా పోయింది. కొనుగోలుకు మార్కెట్‌లో ధాన్యం రాశులు పడి ఉన్నాయి. రైతులు తాము పండించిన వరి ధాన్యానికి మార్కెట్లో రూ.2400–2600 వరకు లభిస్తున్న ధరపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రైతులు బయటి మార్కెట్ ధర రూ.1600 కాగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కేవలం రూ.1750గా నిర్ధారించారు. ఈ ఏడాది వరి ధాన్యానికి మంచి ధర లభిస్తోంది.
మార్కెట్‌లో పెరుగుతున్న
వరి ధాన్యం ధరలు
రూ.2600 వరకు మద్దతు ధరపై రైతన్నల హర్షం
Comments
Please login to add a commentAdd a comment