పార్టీకి పూర్వ వైభవం తెద్దాం
సాక్షి,బళ్లారి: నగరంలో బీజేపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ముందుగా భరతమాత చిత్రపటానికి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి బీజేపీకి భద్రకోటగా మార్చామన్నారు. ప్రస్తుతం ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ కమిటీలు బాగా పని చేయాలన్నారు. ఇంటింటా బీజేపీ సభ్యత్వం తీసుకునే విధంగా పని చేయాలన్నారు. దేశంలో మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి ముందడుగు వేయాలన్నారు. నగరంలో బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు మినహా కొత్త అభివృద్ధి పనులు జరగడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్న విషయాన్ని ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్, నగర కార్పొరేటర్ ఇబ్రహీంబాబు, పార్టీ నాయకులు వీరశేఖరరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment