పెన్షన్ మంజూరుకు వినతి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో ఎయిడెడ్ కళాశాల అధ్యాపకులకు పెన్షన్ మంజూరు చేయాలని ఎయిడెడ్ కళాశాల అధ్యాపకులు పెన్షన్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం బెళగావిలో సువర్ణ విధానసౌధ వద్ద విధాన పరిషత్ సభ్యుడు శశీల్ నమోషి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఎయిడెడ్ కళాశాల అధ్యాపకులకు పెన్షన్ మంజూరు విషయంలో సర్కార్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా మహేష్, మోహన్‌రాజ్, ప్రేమచంద్, రాజేష్, విశ్వనాథ్, జ్యోతి, శరణప్పలున్నారు.
నిందితులపై చర్యలు చేపట్టాలి
రాయచూరు రూరల్: బీదర్ జిల్లాలో అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు చేపట్టాలని వీర కన్నడ సేన సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం బీదర్ జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి అధ్యక్షుడు సుబ్బణ్ణ మాట్లాడారు. బీదర్ జిల్లా విలాసపురలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి, విగ్రహానికి అవమాన పరిచిన వారిని కఠినంగా శిక్షించి దేశద్రోహులుగా పరిగణించి చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాబూరావ్, బసవరాజ్, గౌతమ్, అంబాదాస్, సందీప్, భగవాన్‌లున్నారు.
వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment