ఉప నగరాలు | - | Sakshi
Sakshi News home page

ఉప నగరాలు

Published Fri, Jan 31 2025 1:04 AM | Last Updated on Fri, Jan 31 2025 1:04 AM

ఉప నగరాలు

ఉప నగరాలు

శుక్రవారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 202
సిలికాన్‌ సిటీ చుట్టూ

బనశంకరి: ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన గురువారం విధానసౌధలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఉప నగరాల కల్పన, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల వేధింపులకు బ్రేక్‌ తదితరాలపై ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ వివరాలను న్యాయశాఖమంత్రి హెచ్‌కే.పాటిల్‌ విలేకరులకు వెల్లడించారు.

ఉపనగర పథకానికి ఆమోదం

బెంగళూరులో జన రద్దీ, వాహన రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. అందరూ నగరంలో నివాసం ఉండాలని అనుకుంటారు. ఈ ధోరణిని తగ్గించడానికి నగరం చుట్టుపక్కల దేవనహళ్లి, నెలమంగల, హోసకోటే, దొడ్డబళ్లాపుర, మాగడి, బిడదితో కలిపి 6 పట్టణాలకు మెరుగైన రోడ్డు, రైలు మార్గాలను కల్పించి శాటిలైట్‌ టౌన్‌షిప్‌లుగా అబివృద్ధి చేయాలని కేబినెట్‌లో తీర్మానించారు. గ్రేటర్‌ బెంగళూరు పరిధిలో రామనగర జిల్లా, బిడది హోబళి బైరమంగల, బన్నిగెరె, హోసూరు, కేజీ.గొల్లరపాళ్య, కంచుగారనహళ్లి, అరళాళుసంద్ర, కెంపయ్యనపాళ్య, మండలహళ్లి, హరోహళ్లికి కూడా సమగ్ర ఉప నగర పథకం అమలు. బీఎంఆర్‌ ప్రదేశాల్లో టౌన్‌షిప్‌ల అభివృద్ధి కార్యకలాపాలను చేపడతారు.

క్రీడాకారులకు రిజర్వేషన్ల పెంపు

● కేపీఎస్సీలో నిబంధనల సవరణకు గజెట్‌లో ప్రకటించి అభ్యంతరాలు, సలహాలు ఆహ్వానం.

● క్రీడాకారులకు ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపు. పోలీస్‌శాఖలో నేరుగా నియామకాల్లో కానిస్టేబుల్స్‌ నుంచి డీఎస్పీ వరకు నియామకానికి 2 శాతం నుంచి 3 శాతానికి పెంచాలని నిర్ణయం

● రాష్ట్రంలో మౌలిక వసతులు, పథకాలకు పీపీపీ విధానం అమలు కొనసాగింపు

● హొళెనరసీపుర రైల్వే క్రాసింగ్‌ రోడ్డుకు బదులు అక్కడ ఫ్లై ఓవర్‌ నిర్మాణం. ఇందుకు రూ.45.99 కోట్ల నుంచి రూ.83.72 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

● రూ. 25 కోట్లతో 50 గ్రామ పంచాయతీల్లో సోలార్‌ వీధి దీపాల ఏర్పాటు.

దేవనహళ్లి, నెలమంగల, హోసకోటే, దొడ్డబళ్లాపుర, మాగడి, బిడది..

ఈ ప్రాంతాలకు సిటీ నుంచి

మెరుగైన రవాణా వసతులు

బెంగళూరుపై ఒత్తిడి నివారణ చర్యలు

కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement