![-](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30bng21-120041_mr-1738265200-0.jpg.webp?itok=I3yE4Ug7)
యశవంతపుర: రైలు తలుపు వద్ద నిలబడిన విద్యార్థి ఒకరు అదుపుతప్పి కింద పడిపోయాడు, అదృష్టవశాత్తు బతికిపోయాడు. ఈ బుధవారం రాత్రి జరిగింది. హాసన్‌లో పీయూసీ ఫస్టియర్ చదివే ముజామిల్ (17) కేఆర్ నగర నుంచి హాసన్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రైస్ రైల్లో ప్రయాణిస్తున్నాడు. బోగీలో తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. హొళెనరసీపుర పట్టణానికి సమీపంలో హేమావతి నది వంతెనపై వెళుతుండగా జారి 70 అడుగుల ఎత్తు నుంచి నదిలోకి పడిపోయాడు. చూసినవారందరూ గట్టిగా కేకలు వేశారు.
అయితే నది నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పాటు అతనికి ఈత రావడంతో ఈదుకుంటూ ఓ బండరాయిపైకి చేరుకుని రక్షించాలంటూ అరవసాగాడు. స్థానికులు చూసి క్షేమంగా ఒడ్డుకు తెచ్చారు. గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment