హైవేపై కారు దగ్ధం
దొడ్డబళ్లాపురం: కదులుతున్న కారులో మంటలు చెలరేగి కాలిపోయిన సంఘటన బెంగళూరు–మైసూరు హైవేలో జరిగింది. ఓ కుటుంబం బెంగళూరు నుంచి రామనగరకు వెళ్తోంది. రామనగర తాలూకా బిడది వద్ద వెళ్తున్న కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన కారు డ్రైవర్, దంపతులు, ముగ్గురు పిల్లలు గబగబా దిగిపోయారు. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.
ట్రక్‌ను కారు ఢీ, డ్రైవర్ మృతి
రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో కారు డ్రైవర్ చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయడ్డ సంఘటన దేవనహళ్లి తాలూకా కంబళీపుర వద్ద జరిగింది. మృతున్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమర్ ప్రసాద్‌గా గుర్తించారు. క్షతగాత్రుల, పేర్లు, ఊరు వివరాలు తెలిసిరాలేదు. వేగంగా వచ్చిన కారు నిలిపి ఉన్న ట్రక్‌ను ఢీకొని కారు మూడు పల్టీలు కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment