![బ్యాంకు రుణం కేసులో దోషే](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06bng113_mr-1738870983-0.jpg.webp?itok=xj6PmHKU)
బ్యాంకు రుణం కేసులో దోషే
శివాజీనగర: ప్రభుత్వ ఉద్యోగుల నకిలీ ఆధారాలు సృష్టించి మోసానికి పాల్పడిన కేసులో మాజీ మంత్రి ఎస్‌ఎన్ కృష్ణయ్య శెట్టిని దోషిగా బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. బ్యాంకును మోసగించిన కేసులో ఈ సంచలన తీర్పు వచ్చింది. 2008లో ఎస్‌బీఎం బ్యాంక్ సిబ్బంది ఆయనపై వంచన, ఫోర్జరీ తదితర ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. నకిలీ దాఖలాలతో రూ. 7.17 కోట్ల రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు. అప్పటినుంచి విచారణ సాగుతోంది. గురువారం ఈ మేరకు జడ్జి తీర్పు వెలువరించారు. అయితే శిక్షను ఇంకా ఖరారు చేయలేదు. 3 సంవత్సరాలకు పైబడి జైలుశిక్ష పడితే జైలుకు తరలిస్తారు, అంతకంటే తక్కువ అయితే బెయిలు లభిస్తుందని న్యాయ నిపుణులు తెలిపారు.
మరో కేసులో ఊరట
మరో కేసులో కృష్ణయ్యశెట్టికి ఊరట దక్కింది. మాలూరులో 2023 ఏప్రిల్ 1న ఆయన ఇంటిపై ఎన్నికల అధికారులు దాడులు జరిపి పెద్దమొత్తంలో పలు రకాల వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొన్నారు. దీనిని ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టు మెట్లెక్కారు. తాను అభ్యర్థిని కాదని, ఎన్నికలలో లేనని పేర్కొన్నారు. వాద ప్రతివాదనలను ఆలకించిన హైకోర్టు జడ్జి నాగప్రసన్న.. కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు
మాజీ మంత్రి కృష్ణయ్యశెట్టికి చుక్కెదురు
Comments
Please login to add a commentAdd a comment