వడ్డీ వ్యాపారులూ.. జాగ్రత్త
యశవంతపుర: అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిపై కార్వార జిల్లా హళియాళ, యల్లాపుర, ముండగోడు ప్రాంతాలలో పోలీసులు బుధవారం రాత్రి కూడ దాడులు చేశారు. మీటర్ వడ్డీ వ్యాపారుల ఇళ్ల వద్దకు వెళ్లి పోలీసులు హెచ్చరించారు. అధిక వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలపై ముండగోడు తాలూకాలో అధిక ఫిర్యాదులు అందాయి. దీంతో అక్కడ పోలీసులు ముమ్మరంగా సోదాలు జరిపి వడ్డీవ్యాపారుల నుంచి కొన్నిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాండేలిలోను వడ్డీ వ్యాపారులతో మాట్లాడారు. గాంధీనగరలోని కిశన సుభాస కంజరవాటి, వినోద సురేశ కంజరవాటి, వినేకర, విజయ సాయణ్ణ పెరుమల, మౌలా రిక్షవాలా ఇళ్లలో గాలింపు నిర్వహించారు.
ఖాకీల తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment